Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#HBDSuperStarRajinikanth : ఎవర్ గ్రీన్ యాంగ్రీయంగ్ హీరో

బస్సు టిక్కెట్టు కొట్టి పొట్ట పోసుకునే ఓ అత్యంత సాధారణ ఉద్యోగి… కట్ చేస్తే కోట్లాది భారతీయుల హృదయాలను కొల్లగొట్టే హీరో అయ్యాడు. బూతద్దం పెట్టి వెతికినా హీరోయిజం తాలూకు లక్షణాలు మచ్చుకైనా కన్పించని ఓ స

Advertiesment
#HBDSuperStarRajinikanth : ఎవర్ గ్రీన్ యాంగ్రీయంగ్ హీరో
, మంగళవారం, 12 డిశెంబరు 2017 (09:19 IST)
బస్సు టిక్కెట్టు కొట్టి పొట్ట పోసుకునే ఓ అత్యంత సాధారణ ఉద్యోగి… కట్ చేస్తే కోట్లాది భారతీయుల హృదయాలను కొల్లగొట్టే హీరో అయ్యాడు. బూతద్దం పెట్టి వెతికినా హీరోయిజం తాలూకు లక్షణాలు మచ్చుకైనా కన్పించని ఓ సామాన్యుడు... వెండితెర వేల్పుగా వెలిగిపోయాడు. అతనే సూపర్ స్టార్ రజనీకాంత్. అతనో పెద్ద అందగాడు కాదు.. డాన్స్‌లు చేయలేడు. చెప్పుకోదగిన అంతటి గొప్ప యాక్టరూకాదు.
 
కానీ... అతడి ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్. అతడి స్టైల్ అదుర్స్. అతడి సినిమా వస్తోందంటే.. పడిచచ్చే ఫ్యాన్స్ కోట్లాదిమంది ఉన్నారు. కోలీవుడ్, టాలీవుడ్ బాలీవుడ్..  ఏ వుడ్ అయినా.. అతడి సినిమా వస్తోందంటే.. షేక్ అవ్వాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్… డిసెంబర్ 12వ తేదీన 67వ యేటలోకి అడుగుపెడుతున్నారు. 
 
శివాజీ రావు గైక్వాడ్ అలియాస్ రజనీకాంత్ … ఈ పేరులో ఓ సూపర్ పవర్ ఉంది. భారత్‌లో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ రజనీ వారందరికన్నా భిన్నం. వేరెవరికీ లేని క్రేజ్‌ ఆయన సొంతం. 40 యేళ్లుగా వెండితెరను ఏలుతూ.. ఇప్పటికీ ఒక్క అంగుళం కూడా క్రేజ్ తగ్గని ఎవర్ గ్రీన్ యాంగ్రీ యంగ్ హీరో రజనీ.
 
తన మార్క్ స్టైల్స్, డైలాగ్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ శివాజీ ఒక్క డైలాగ్ చెబితే వందసార్లు చప్పట్లు కొట్టాల్సిందే. ఆయనకు భాషలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకున్నారు. తనకే సొంతమైన విభిన్న స్టైల్స్‌తో ప్రేక్షకులను మిస్మరైజ్ చేస్తున్నారు. 60 ఏళ్లు దాటినా ఇప్పటికీ వెండితెరపై నవ యుకుడిలా కనిపించడం ఒక్క రజనీకే సాధ్యమైంది.
 
1950 డిసెంబర్ 12వ తేదీన కర్ణాటకలో రామోజీరావ్ గైక్వాడ్ , జిజియా బాయ్ దంపతులకు జన్మించారు రజనీ. అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆర్టీసీ కండాక్టర్‌గా పనిచేసిన సూపర్ స్టార్ … తన స్నేహితుడుతోటి డ్రైవర్ సాయంతో మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. అక్కడే ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్ దృష్టిలో పడ్డారు. "అపురూప రాగంగల్" సినిమాతో క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా కేరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత విలన్ పాత్రల్లో కనిపించారు. ముత్తు రామన్ డైరెక్షన్‌లో వచ్చిన 'భువన ఓరు కల్వికరు' చిత్రం రజనీకాంత్‌ను హీరోగా నిలబెట్టింది.
 
ఆయన కెరీర్‌లో ఎన్నో బిగ్ బ్లాస్టర్ హిట్స్ వచ్చాయి. అలాంటి వాటిలో భాషా, ముత్తు, నరసింహా, శివాజీ, చంద్రముఖి, రోబో.. ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో స్టైల్‌. ఎప్పటికప్పుడు న్యూ లుక్కుతో యువ హీరోలకే అసూయ పుట్టించేలా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. రజినీ అప్ కమింగ్ మూవీ రోబో 2.0 .. మరి ఈ మూవీ ఎన్నెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజినీ పుట్టిన రోజు - ఆ విషయంపై క్లారిటీ వస్తుందా..?