పారామిలటరీలో వీఆర్‌ఎస్‌లు అధికమే

Webdunia
శనివారం, 17 జులై 2021 (15:21 IST)
దిల్లీ: కేంద్ర హోం శాఖ పరిధిలోని బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటి ఆరు పారామిలటరీ దళాల్లో స్వచ్ఛంద పదవీ విరమణలు, రాజీనామాలు అధికంగానే ఉంటున్నాయి. ఇందుకుగల కారణాలపై ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేయించలేదు.

గత దశాబ్దం 2011-2020లో 81,007 మంది స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) చేశారు. 2017లో అత్యధికంగా 11,728 మంది వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. ఇదే సమయంలో 15,904 మంది రాజీనామా చేశారు. 2013లో వీరి సంఖ్య అధికంగా ఉంది. ఆ ఒక్క ఏడాదే 2,332 మంది ఉద్యోగాలను విడిచిపెట్టారు. వ్యక్తిగత, ఆరోగ్య కారణాలు, ఉన్నత ఉద్యోగాలు లభించడం వంటివి ఇందుకు కారణాలని అధికారులు విశ్లేషిస్తున్నారు.

బలగాల వారీగా పరిశీలిస్తే బీఎస్‌ఎఫ్‌ నుంచి రాజీనామాలు, వీఆర్‌ఎస్‌లు అధికంగా ఉంటున్నాయి. తరువాత స్థానంలో సీఆర్‌పీఎఫ్‌ ఉంది. ఈ రెంటింటితో పాటు సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్‌ను కూడా పారామిలటరీ దళాలుగా వ్యవహరిస్తుంటారు. వాటి బలగం దాదాపు పది లక్షల వరకు ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meenakshi Chaudhary: అలిపిరి నుంచి కాలినడక తిరుమలకు.. శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి (video)

Sri Vishnu: శ్రీవిష్ణు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ మృత్యుంజ‌య్‌ రిలీజ్ డేట్

Devisri: ఉస్తాద్ భగత్ సింగ్ లో రెండు అదిరిపోయే పాటలు రాబోతున్నాయి

లోకేష్ కనకరాజ్ కూలీ సినిమాపై సౌందర్య రజనీకాంత్ ఏమన్నదో తెలుసా?

తెలిసినవారికి వివరణ అవసరం లేదు, చెప్పినా వినరు : ఏఆర్ రెహమాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments