Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2023 నాటికి తెరుచుకోనున్న అయోధ్య రామాలయం తలుపులు

2023 నాటికి తెరుచుకోనున్న అయోధ్య రామాలయం తలుపులు
, శనివారం, 17 జులై 2021 (15:09 IST)
దేశంలోని రామభక్తులందరూ ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం తలుపులు 2023 నాటికి తెరుచుకోనున్నాయి. ఏడాది చివరినాటికి భక్తులకు శ్రీరామదర్శనం కల్పించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించింది. 15మంది సభ్యలున్న ఈ ట్రస్టు రెండురోజులపాటు సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ మాజీ సలహాదారు, ట్రస్ట్ చీఫ్ నృపేంద్రమిశ్రా అధ్యక్షత వహించారు. 
 
ఆలయ నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులతోపాటు గర్భగుడిలో మూలమూర్తి ప్రతిష్ఠాపన, భక్తులకు దర్శనభాగ్యం కల్పించే విషయాన్ని ట్రస్టు కూలంకషంగా చర్చించింది. సమావేశం వివరాలను ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ అయోధ్యలో విలేకరులకు వివరించారు.
 
'గత రెండు రోజులుగా జరిగిన సమావేశంలో 2023 చివరినాటికల్లా భక్తులకు 'భగవాన్' దర్శనం కల్పించే విషయమై చర్చించాం. . గర్భగుడి నిర్మాణం, మూలమూర్తి ప్రతిష్ఠాపన అంశాలనూ చర్చించాం. మొత్తం నిర్మాణం పర్యావరణ అనుకూలమైన విధంగా జరుగుతోంది. 2025నాటికి మొత్తం 70 ఎకరాలను పూర్తిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం ' అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌లో రెండు జ‌ర్మ‌న్ షెప‌ర్డ్ కుక్కలకు మరణశిక్ష