Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోరు వర్షంలో బైకుపై చక్కర్లు... ఆపై సబ్బుతో స్నానం

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (12:29 IST)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు అకతాయి కుర్రోళ్లు అల్లరి చేష్టలకు పాల్పడ్డారు. జోరు వర్షంలో బైకుపై చక్కర్లు కొడుతూ సబ్బుతో స్నానం చేశారు. వీరు చేసిన అల్లరి పనులను ఇతర వాహనదారులు మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటన యూపీలోని కాన్పూర్‌లో జరిగింది. 
 
కాగా, ఈ ఘటనపై కాన్పూర్ పోలీసులు స్పందించారు. ఈ ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. పైగా, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కాన్పూర్ పోలీసులు హెచ్చరించారు. 
 
9వ తేదీ వరకు పలు రైళ్ళు రద్దు 
 
సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో ట్రాక్ మరమ్మతు, సిగ్నలింగ్ ఇంజనీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ రైళ్ళను రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. మొత్తం 24 రైళ్ళ సర్వీసులను తత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. అలాగే, లింగంపల్లి, ఫలక్ నుమా, ఉందానగర్, రామచంద్రాపురం మధ్య నడిచే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా రద్దు చేస్తున్నామని, అందువల్ల ప్రయాణికులు సహకరించాలని కోరారు. 
 
కాగా, రద్దు చేసిన రైళ్ల సర్వీసులను పరిశీలిస్తే, కాజీపేట - డోర్నకల్, విజయవాడ - డోర్నకల్, భద్రాచలం - విజయవాడ, విజయవాడ - భద్రాచలం, సికింద్రాబాద్ - వికారాబాద్, వికారాబాద్ - కాచిగూడ, సికింద్రాబాద్ - వరంగల్, వరంగల్ - హైదరాబాద్, సిర్పూర్ టౌన్ - కరీంనగర్, కరీంనగర్ - నిజామాబాద్, కాజీపేట - సిర్పూర్ టౌన్, బల్లార్షా - కాజీపేట, భద్రాచలం - బల్లార్షా, సిర్పూర్ టౌన్ - భద్రాచలం, కాజీపేట - బల్లార్షా, కాచిగూడ - నిజామాబాద్, నిజామాబాద్ - నాందేడ్ ప్రాంతాల మధ్య నడిచే రైళ్ళు ఉన్నాయి. 
 
అలాగే, కాచిగూడ - మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్‌‌ప్రెస్ ఉందానగర్ వరకు, నాందేడ్ - నిజామాబాద్ - పండర్పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ముత్కేడ్ వరకు మాత్రమే నడుస్తుందని తెలిపింది. 
 
అదేవిధంగా 22 ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా రద్దు చేసింది. వీటిలో లింగంపల్లి - హైదరాబాద్, హైదరాబాద్ - లింగంపల్లి మధ్య నడిచే 10 రైళ్లు, లింగంపల్లి - ఉందానగర్ 3, లింగంపల్లి - ఫలక్ నుమా 2, ఉందానగర్ - లింగంపల్లి 4, ఫలక్ నుమా - లింగంపల్లి 2, రామచంద్రాపురం - ఫలక్ నుమా మధ్య నడిచే ఒక రైలు సర్వీసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments