Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్లు

train
, బుధవారం, 28 జూన్ 2023 (08:38 IST)
దేశ వ్యాప్తంగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు అంటే శుక్రవారం వరకు పలు రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. భద్రక్ - ఖరగ్‌పూర్ సెక్షన్‌లో బహనగ బజార్ వద్ద నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేయనున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి మంగళవారం తెలిపారు. 
 
ఇందులో భాగంగా, 28వ తేదీన హౌరా - సత్యసాయి ప్రశాంతి నిలయం (22831), హైదరాబాద్‌ - షాలిమార్‌ (18046) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌ - సికింద్రాబాద్‌ (22849), షాలిమార్‌ - సికింద్రాబాద్‌ (12773), విశాఖ - షాలిమార్‌(22854), తాంబరం - సంత్రాగచ్చి (22842), పుదుచ్చేరి - హౌరా (12868), చెన్నై సెంట్రల్‌ - షాలిమార్‌ (22826) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, 29న ఎస్‌ఎంవీ బెంగళూరు - హౌరా (22888), చెన్నై సెంట్రల్‌ - సంత్రాగచ్చి (22808), 30న సత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా (22832), సికింద్రాబాద్‌ - షాలిమార్‌ (22850) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్నే నిలదీస్తావా.. నీకెంత ధైర్య.. నీకు దిక్కున్న చోట చెప్పుకో.. మహిళపై తమ్మినేని ఫైర్