విజయ్ రూపానీకి అదృష్ట సంఖ్యే దురదృష్టాన్నిస్తుంది.. జూన్ 12 (12-06)న ప్రాణం పోయింది.. (video)

సెల్వి
శుక్రవారం, 13 జూన్ 2025 (08:55 IST)
Rupani
అహ్మదాబాద్‌లో గురువారం (జూన్ 12) జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మరణించిన తేదీ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. ఆయన జూన్ 12 (12-06)న మరణించారు. ఈ తేదీకి సంబంధించిన నెంబర్ ఒకప్పుడు ఆయన లక్కీ నెంబర్. ఈ క్రమంలో విజయ్ రూపానీ అన్ని వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో ఒకే సంఖ్య ఉందని చెప్తున్నారు. అయితే, అదే 1206 తేదీన మరణించడంతో ఆయన అదృష్ట సంఖ్య దురదృష్టకరమని తేలింది.
 
రూపానీకి 1206 నంబర్‌తో బలమైన సంబంధం ఉందని తెలుస్తోంది. ఆయన వాహనాలన్నింటి నంబర్ ప్లేట్లలో 1206 అని ఉంది. లండన్ వెళ్లే విమానంలో ఆయన సీటు నంబర్ 12, ఆయన బోర్డింగ్ సమయం మధ్యాహ్నం 12:10. ఇది 12 నంబర్‌తో ఆయనకున్న బలమైన సంబంధాన్ని కూడా చూపిస్తుంది. విచారకరంగా, అదే సంఖ్య గల రోజున ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 242 మందితో అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI 171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది.
 
రూపానీ అదే విమానంలో లండన్‌లో ఉన్న తన కుమార్తెను కలవడానికి వెళ్తున్నారు. అయితే, రూపానీ ఆ ఘోర ప్రమాదం నుండి బయటపడలేకపోయారు. ఈ ఘోర విమాన ప్రమాదంలో మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments