Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్ - టెహ్రాన్‌పై బాంబుల వర్షం

ఠాగూర్
శుక్రవారం, 13 జూన్ 2025 (08:40 IST)
ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. దీంతో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. ఇరాన్‌లోని అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడింది. అయితే. తమ దేశంపై కూడా ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడవచ్చన్న భయంతో ఇజ్రాయెల్ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. మరోవైపు, ఈ దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని అగ్రరాజ్యం అమెరికా స్పష్టం చేసింది. 
 
ఇజ్రాయెల్ సైనిక వర్గాల సమాచారం మేరకు.. ఇరాన్‌పై జరిగిన ఆపరేషన్‌‍లో డజన్ల కొద్దీ విమానాలు పాల్గొన్నాయని వెల్లడించాయి. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక కేంద్రాలు, సైనిక కమాండ్ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపనట్టు పేర్కొంది. ఇరాన్ దాదాపు 15 అణు వార్ హెడ్‌లకు సరిపడా శుద్ధి చేసిన యురేనియం నిల్వ చేసిందని, ప్రయోగించగల అణ్వాయుధాన్ని తయారు చేయడానికి కొన్ని నెలల దూరంలోనే ఉందని ఇజ్రాయెల్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments