Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప రాష్ట్రపతి షూలనే కొట్టేసిన దొంగలు... డొల్ల సెక్యూరిటీ అంటూ...

నిజంగా.. నవ్వు కోవాల్సిన సంఘటన ఇది. దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తికి ఎప్పుడూ జెడ్ కేటగిరి భద్రత ఉంటుంది. ఆయన ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతంలో ఎప్పుడూ సెక్యూరిటీ తిరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా వెంకయ్యనాయుడు చుట్టూ ఉన్న వ్యక్తులందరూ సేఫ్ జోన్‌లోనే ఉంటారని

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (19:18 IST)
నిజంగా.. నవ్వు కోవాల్సిన సంఘటన ఇది. దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తికి ఎప్పుడూ జెడ్ కేటగిరి భద్రత ఉంటుంది. ఆయన ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతంలో ఎప్పుడూ సెక్యూరిటీ తిరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా వెంకయ్యనాయుడు చుట్టూ ఉన్న వ్యక్తులందరూ సేఫ్ జోన్‌లోనే ఉంటారని అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం అంతా విరుద్ధం. ఏకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు షూలను ఎవరో దొంగిలించుకుని వెళ్ళిపోయారు. షూలనే కాపాడలేని సెక్యూరిటీ సిబ్బంది ప్రముఖులను ఏం కాపాడతారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
 
బెంగుళూరులోని ఎంపి మోహన్ ఇంట్లో ఒక కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హాజరయ్యారు. ఇంట్లోకి వెళ్ళే సమయంలో వెంకయ్యనాయుడు తన షూను ఇంటి బయట వదిలి వెళ్ళారు. ఆ తరువాత బయటకు వచ్చి చూసేసరికి షూలు కనిపించలేదు. దీంతో కొద్దిసేపు అలాఇలా తిరిగారు వెంకయ్య. ఉపరాష్ట్రపతితో పాటు ఆయన సెక్యూరిటీ, సన్నిహితులు కూడా షూలను వెతికారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కొత్త షూలను సెక్యూరిటీ సిబ్బంది కొనుక్కుని వచ్చి ఇచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటంపై ఉపరాష్ట్రపతి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారట.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments