Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీల అనుచిత ప్రవర్తన : ఉపరాష్ట్రపతి వెంకయ్య కంటతడి

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (13:20 IST)
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాపడ్డాయి. రెండు రోజులు ముందుగానే ఈ రెండు సభలు వాయిదావేశారు. ముఖ్యంగా, రాజ్యసభలో ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారు. మంగళవారం సభలో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఛైర్మన్ స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గురయ్యారు.
 
సభలో ఎంపీల ప్రవర్తన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయం లాంటి పార్లమెంట్లో ఎంపీ టేబుల్స్‌పైకి నిరసన వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ క్రమంలోనే ఆయన కంటతడి పెట్టారు. గద్గద స్వరంతో మాట్లాడారు. చేతులు కూడా వణకుతూ కనిపించాయి. 
 
మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభంగానే.. ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రసంగించారు. మంగళవారం సభలో చోటు చేసుకున్న పరిణామాలు, ఎంపీ అనుచిత ప్రవర్తన పట్ల ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
 
'ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ దేవాలయం లాంటింది. కొందరు సభ్యులు అమర్యాదగా ప్రవర్తించారు. చట్టసభల పవిత్రను దెబ్బతీశారు.  టేబుల్‌పై కూర్చున్నారు. మరికొందరు టేబుల్స్‌పై నిలబడ్డారు. పోడియం ఎక్కి నిరసన తెలపడమంటే గర్భగుడిలో నిరసన తెలిపినట్లే. నిన్నటి పరిణామాలను తలచుకుంటే నిద్ర పట్టే పరిస్థితి లేదు. ఇది చాలా దురదృష్టకరమైన పరిణమం. సభలో ఇన్ని రోజుల పాటు కార్యకలాపాలను స్తంభింపజేయడం మంచిది కాదు' అని వెంకయ్య నాయుడు అన్నారు. 
 
కాగా, మంగళవారం రాజ్యసభలో రచ్చ జరిగింది. రైతుల సమస్యలపై చర్చ జరుగుతుండగా.. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లటి వస్త్రాలను సభలో ప్రదర్శించారు. రూల్‌ బేక్‌ని చింపేసి గాల్లోకి విసిరేశారు. 
 
కొందు ఎంపీలైతే  ఛైర్మన్ సీటుకు దిగువన పార్లమెంటరీ సిబ్బంది కూర్చొనే చోట.. టేబుళ్లపైకి ఎక్కి నిలబడ్డారు. దాదాపు గంటన్నర సేపు అక్కడే బైఠాయించారు. పెద్దల సభగా చెప్పుకునే రాజ్యసభలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడాన్ని ఛైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్రంగా తప్పుబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీకి అరుదైన రికార్డు

తెలంగాణాలో గద్దర్ అవార్డులు సరే.. మరి ఏపీలో నంది అవార్డులు ఇస్తారా?

PRABHAS :భీమవరంకు రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారా?

కళాకారులకు సేవ - జంథ్యాలపై బుక్ - విజయ నిర్మల బయోపిక్ చేయబోతున్నా: డా. నరేష్ వికె

రానా దగ్గుబాటి సమర్పణలో ప్రేమంటే ఏమిటో చెప్పదలిచిన సుమ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments