Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీకా పాలసీ మరో నోట్ల రద్దు లాంటిది: రాహుల్ గాంధీ

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (20:09 IST)
దేశంలోని 18 ఏళ్లు నిండిన పౌరులందరికీ టీకాలు వేస్తామని మంగళవారం దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అయితే ప్రధాని చేసిన ఈ వాగ్దానం నిజంగా పేదలకు ఉపయోగపడేది కాదని, ఇది పూర్తిగా కొద్ది మంది వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమేనని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

అంతే కాకుండా టీకా పాలసీ.. నోట్ల రద్దు లాంటి నిర్ణయానికి ఏమాత్రం తీసిపోదని, పెద్ద నోట్లు మార్చుకోవడానికి సాధారణ ప్రజలు లైన్లలో వేచి ఉన్నట్లే టీకా కోసం కూడా భారీగా లైన్లు ఉండబోతాయని రాహుల్ అన్నారు.
 
బుధవారం ట్విట్టర్ ద్వారా స్పందించిన రాహుల్ గాంధీ.. ‘‘కేంద్ర ప్రభుత్వ టీకా పాలసీ మరో నోట్లరద్దుకు ఎంత మాత్రం తక్కువ కాదు. సాధారణ ప్రజలు లైన్లలోనే ఉండిపోతారు. డబ్బు, ఆరోగ్యం, ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది.

చివర్లో కొద్ది మంది వ్యాపారవేత్తలు మాత్రమే లాభపడతారు’’ అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. కాగా, దేశంలో 12 కోట్ల మంది ప్రజలకు కోవిడ్ టీకా అందిందని మంగళవారం నాటి ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.

దేశంలో విజృంభిస్తున్న కోవిడ్ రెండవ దశపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 1 నుంచి దేశంలో 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ టీకాలు వేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వీలైనంత తొందరలో దేశ ప్రజలకు టీకాలు అందుతాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments