Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ 4 రాష్ట్రాల్లో ఉచిత వ్యాక్సిన్‌!

Advertiesment
Free vaccine
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (19:43 IST)
దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి పలు చర్యలు చేపట్టింది.

అందులో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా అందజేసేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రాష్ట్రాలు నేరుగా టీకా తయారీ సంస్థల వద్దే వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.
 
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ వంతుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా పలు చర్యలు తీసుకుంటున్నాయి.

ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరూ టీకాకు దూరం కావొద్దని భావించిన కొన్ని రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని నిర్ణయించాయి. అలా ప్రకటించిన రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్‌, అసోం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఉన్నాయి.
 
18 ఏళ్లు పైబడని వారందరికీ ఉచితంగా టీకా అందిస్తామని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ కార్యాలయం బుధవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

సీఎం అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ సైతం తమ పౌరుల టీకా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం భూపేశ్‌ బఘేల్‌ ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా పరీక్షలకు, కరోనా ఆసుపత్రిలో అడ్మిషన్ కొరకు 104 కాల్ సెంటర్లకు ఫోన్ చేయాలి: కృష్ణా జిల్లా కలెక్టర్