Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్మెట్ ధరించలేదని నుదుటిపై తాళంచెవితో పొడిచారు..

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (17:31 IST)
Key
హెల్మెట్ ధరించలేదని పోలీసులు ఓవరాక్షన్ చేశారు. హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనం నడుపుతున్న యువకుడి నుదుటిపై తాళంచెవితో పొడిచారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని రుద్రాపుర్‌ పట్టణంలో చోటుచేసుకుంది. ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జీకి తెగబడ్డారు. ఈ ఘటనపై మండిపడ్డ జిల్లా పోలీసు శాఖ ఓ ఎస్సై, ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.  
 
వివరాల్లోకి వెళితే.. రామ్‌పురా గ్రామ నివాసి దీపక్‌ (20) మిత్రుడితో కలిసి ద్విచక్రవాహనంలో పెట్రోల్‌ పోయించుకునేందుకు స్థానిక పెట్రోల్‌ బంక్‌కు వెళుతున్నాడు. ఆ సమయంలో అక్కడ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు వారి వాహనాన్ని ఆపారు. అయితే వారు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన ఓ పోలీసు వారి బైక్‌ తాళంచెవిని లాక్కొని దీపక్‌ నుదిటిపై బలంగా గుచ్చాడు. 
 
కాగా నుదుటిపై తాళం చెవితోనే గ్రామానికి వెళ్లిన బాధితుడు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్థులకు వివరించాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులుస్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఈ దారుణానికి పాల్పడ్డ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసు స్టేషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నిస్తుండగా వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.
 
సమాచారం అందుకున్న స్థానిక శాసనసభ్యుడు రాజ్‌కుమార్ తుక్రాల్ పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఈ సంఘటపై అధికారులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే స్థానికులను సముదాయించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments