Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ ధరించలేదని మేకను అరెస్టు చేసిన పోలీసులు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (17:26 IST)
కొన్నిసార్లు పోలీసుల ప్రవర్తన, వారి చేష్టలు చూస్తుంటే నవ్వొస్తుంది. ఇలాంటి వారా మనకు రక్షణ కల్పించేది అనే అనుమానం కలుగుతుంది. తాజాగా పోలీసులు చేసిన ఓ పని ప్రతి ఒక్కరికీ నవ్వుతో పాటు.. ఆగ్రహం తెప్పిస్తుంది. ముఖానికి మాస్క్ ధరించలేదని ఓ మేకను అరెస్టు చేసి ఠాణాకు తీసుకెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈ సంఘటన ఇపుడు సోషల్ మీడియాలో వైరల అవుతోంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రంలోని కాన్పూర్, బిక‌న్‌గంజ్‌కి చెందిన ఓ వ్య‌క్తి త‌న మేక‌ను తీసుకొని రోడ్డు మీద న‌డుస్తుండ‌గా పోలీసులు అత‌న్ని అడ్డుకున్నారు. తిరుగుతున్న మేక‌ను అరెస్టు చేశారు. ఆ భ‌యంతో అక్కడ నుంచి పారిపోయిన య‌జ‌మాని మేక‌ కోసం స్టేష‌న్‌కు పోక‌త‌ప్ప‌లేదు. 
 
సార్ నా మేక‌ను ఎందుకు అరెస్టు చేశారు అని అడిగితే.. 'మేక మాస్క్ లేకుండా బ‌య‌ట తిరుగుతుంది. అందుకే అరెస్ట్ చేశాం' అని స‌మాధానం ఇచ్చారు. దీంతో ఆ య‌జ‌మాని నోరెళ్ల‌బెట్టాడు. త‌ప్పు అయిపోయింది సార్ మ‌ళ్లీ ఇలా జ‌ర‌గ‌కుండా చూసుకుంటాన‌ని బ‌తిమిలాడి ఎలాగోల మేక‌ను విడిపించుకున్నాడు. 
 
కానీ యూపీ పోలీసుల మీద మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ ట్రోల్స్ అవుతున్నాయి. దీనికి వారు.. రివ‌ర్స్ డ్రామా ఆడారు. మేక య‌జ‌మాని మాస్క్ పెట్టుకోక‌పోవ‌డంతో అత‌న్ని అరెస్టు చేసేలోపు ప‌రార్ అయ్యాడు. అందుక‌ని మేక‌ను తీసుకురావాల్సి వ‌చ్చింద‌ని క‌వ‌ర్ చేసుకున్నారు పోలీసులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments