Webdunia - Bharat's app for daily news and videos

Install App

చోరీ చేశాడన్న అనుమానంతో విద్యార్థిని కొట్టి చంపిన టీచర్లు...

Webdunia
బుధవారం, 27 జులై 2022 (08:32 IST)
తమ వాచ్‌ను చోరీ చేశాడన్న అనుమానంతో ఓ విద్యార్థిని కొందరు విచక్షణా రహితంగా కొట్టి చంపేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ జిల్లాలోని పాషిమ్ మడైయా గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిసీలిస్తే, ఈ గ్రామానికి చెందిన దిల్షన్ అలియాస్ రాజా అనే 15 యేళ్ల బాలుడు ఈ నెల 23వ తేదీ ఇంటర్ అడ్మిషన్ కోసం కాలేజీకి వెళ్లాడు. అక్కడ నుంచి తన పని ముగించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. 
 
ఇంతలో ఆ కాలేజీలో పని చేసే శివకుమార్ యాదవ్ అనే ఉపాధ్యాయుడి వాచ్ కనిపించలేదు. ఈ వాచీని రాజానే దొంగిలించివుంటాని బలంగా నమ్మాడు. ఆ తర్వాత రాజాను కాలేజీకి పిలిపించి, సహ ఉపాధ్యాయులు ప్రభాకర్, వివికే యాదవ్‌లతో కలిసి శివకుమార్ యాదవ్ తీవ్రంగా కొట్టాడు. 
 
ఈ దెబ్బలకు తీవ్రంగా గాయపడిన రాజా అక్కడే అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. దీంతో అతన్ని హుటాహుటిన కాన్పూరు ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుల దెబ్బలతో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి కన్నుమూశాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్పీ కున్వర్ అనుపమ్ సింగ్ స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments