ఉత్తరప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వేలు దాటింది. గురువారం కొత్తగా 61 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మొత్తం మూడు వేల కేసుల్లో 1130 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, 61 మంది మరణించారు. మిగతా 1868 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కాగా, యూపీలోని మొత్తం 75 జిల్లాలకుగాను 67 జిల్లాల్లో కరోనా ప్రభావం చూపిందని, మిగతా 8 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ చెప్పారు.
ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 50000 దాటి రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో 15 వేలకు పైగా కరోనా బాధితులను ఆ వైరస్ నుంచి విముక్తి కలిగించారు డాక్టర్లు. ప్రస్తుతం గురువారం వరకు దేశంలో 1700 మంది పైగా ఈ వ్యాధి బారినపడి మరణించారు.