Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త పిల్లలను వదిలేసి బిచ్చగాడితో పారిపోయిన మహిళ.. ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (19:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్త, ఆరుగురు పిల్లలను వదిలివేసి బిచ్చగాడితో లేచిపోయింది. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ మహిళ, బిచ్చగాడి కోసం గాలిస్తున్నారు. యూపీలోని హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజు (45) అనే వ్యక్తి తన భార్య రాజేశ్వరి (36), ఆరుగురు పిల్లలతో కలిసి హర్దోయ్‌లోని హర్పాల్పూర్ ప్రాంతంలో ఉంటున్నారు. అదే ప్రాంతంలో నాన్హే పండిట్ (45) అనే బిచ్చగాడు భిక్షాటన చేసేవాడు. అయితే, అతడు తరచూ రాజేశ్వరితో మాట్లాడేవాడు. చివరికి వారు ఫోనులో కూడా మాట్లాడుకునే వరకు వారి మధ్య పరిచయం ఏర్పడింది. 
 
ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రాజేశ్వరి బట్టలు, కూరగాయలు కొనుక్కోవడానికి మార్కెట్‌కి వెళుతున్నానని తన కుమార్తె ఖుష్బూకు చెప్పి బయటకు వెళ్లింది. కానీ, ఆమె ఎంతకు తిరిగి రాకపోవడంతో రాజు చుట్టుపక్కల అంతా వెతికాడు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. 
 
అదేసమయంలో తన గేదెను విక్రయించగా వచ్చిన డబ్బు కూడా ఇంట్లో కనిపించలేదు. దాంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. ఆమె ఇంట్లోని డబ్బు తీసుకుని నాన్హే పండిట్‌తో వెళ్లిపోయి ఉండొచ్చని రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
దీంతో బీఎన్ఎస్ సెక్షన్ 87 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిచ్చగాడు నాన్హే పండిట్, రాజేశ్వరి కోసం గాలించగా, రాజేశ్వరి ఆచూకీ పోలీసులకు దొరికింది. దాంతో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి శిల్పా కుమారి తెలిపారు. అలాగే పరారీలో ఉన్న నాన్హే పండిట్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments