Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Namma Yatri Auto Issue: నమ్మ యాత్రి ఆటో ఇష్యూ.. నా భార్య ఆటో నుంచి దూకేసింది.. భర్త ఆవేదన

Advertiesment
Namma Yatri Auto Issue

సెల్వి

, శుక్రవారం, 3 జనవరి 2025 (17:28 IST)
Namma Yatri Auto Issue
దేశంలో మహిళలకు భద్రత కరువైందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. బెంగుళూరులో గురువారం రాత్రి మద్యం మత్తులో వున్న ఆటో డ్రైవర్‌ నుంచి తనను రక్షించుకునేందుకు ఓ మహిళ కదులుతున్న ఆటోరిక్షా నుంచి దూకినట్లు ఆమె భర్త సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన తన భార్య ఎలా తప్పించుకుందనే వివరాలను ఆమె భర్త వెల్లడించారు. 'నమ్మ యాత్రి' అనే రైడ్-హెయిలింగ్ అప్లికేషన్‌పై హోరామావు ​​నుండి తనిసంద్రకు ఆటోరిక్షాను ఆమె బుక్ చేసింది.
 
నమ్మ యాత్రి ఆటో ఇష్యూ.. ఆటోను నా భార్య హొరమావు నుండి బెంగుళూరులోని తనిసంద్రకు బుక్ చేసింది. అయితే డ్రైవర్ మద్యం మత్తులో ఆమెను హెబ్బాల్ సమీపంలోని రాంగ్ రూటుకు తీసుకెళ్లాడు. ఆపమని పదే పదే చెప్పినా వినలేదు. దీంతో కదులుతున్న ఆటోలోంచి దూకాల్సి వచ్చింది అని ఆమె భర్త శుక్రవారం ఎక్స్‌లో బాధితురాలి భర్తు పోస్ట్ చేశాడు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి నమ్మ యాత్రిలో కస్టమర్ కేర్ నంబర్ లేదని ఆయన ఫిర్యాదు చేశాడు.
 
నమ్మ యాత్రి అతి పెద్ద లోపం ఏమిటంటే కస్టమర్ సపోర్ట్ లేదు. ఇది మమ్మల్ని "24 గంటలు వేచి ఉండమని" అడుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలు వేచి ఉండటం ఎలా సాధ్యం? మహిళ భద్రతపై ఇదెలా సాధ్యం? అని బెంగళూరు పోలీసులను అతడు ప్రశ్నించారు.
 
తన ఫిర్యాదును పోలీసులు సీరియస్‌గా పరిగణించి నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు వెంటనే స్పందించి విచారణ ప్రారంభించారు.

ఇక ఈ ఫిర్యాదుపై స్పందించిన నమ్మ యాత్రి, "హాయ్ అజర్, మీ భార్యకు కలిగిన అసౌకర్యం గురించి విన్నందుకు మేము చింతిస్తున్నాము, ఆమె ఇప్పుడు బాగానే ఉందని మేము ఆశిస్తున్నాము. దయచేసి మాకు రైడ్ వివరాలను డీఎం చేయండి. మేము దీన్ని వెంటనే పరిష్కరిస్తాము" అని హామీ ఇచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేయసికి సర్ప్రైజ్ సెల్ఫీ ఫోటో ఇచ్చేందుకు సింహాలు బోనులోకి వెళ్లిన ప్రియుడు