Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేయసికి సర్ప్రైజ్ సెల్ఫీ ఫోటో ఇచ్చేందుకు సింహాలు బోనులోకి వెళ్లిన ప్రియుడు

lions

ఐవీఆర్

, శుక్రవారం, 3 జనవరి 2025 (16:15 IST)
సెల్ఫీల పిచ్చి ఎంతోమంది ప్రాణాలను తీస్తోంది. కొంతమందిని చావు చివరి వరకూ తీసుకుని వెళ్తోంది. ఈ వార్తలను చూసైనా పాఠాలు నేర్చుకోవడం లేదు. మళ్లీ అలాంటి తప్పులను చేస్తూ ప్రాణాలను బలి చేసుకుంటున్నారు చాలామంది. తాజాగా తన ప్రేయసికి సర్ప్రైజ్ సెల్ఫీ ఇచ్చేందుకు సింహాలు బోనులోకి వెళ్లాడు ఓ ప్రియుడు. అంతే.. వాటి దాడికి ప్రాణాలు కోల్పోయాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉజ్బెకిస్తాన్ దేశంలో ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ మెప్పు కోసం సింహాల బోనులోకి వెళ్లాడు. అక్కడికి వెళ్లి పడుకుని వున్న 3 సింహాలతో సెల్ఫీ దిగాడు. అవి నిశ్శబ్దంగా వుండటాన్ని చూసి.. సింబా సైలెంటుగా వుండూ అంటూ మెల్లగా అరిచాడు. అంతే... ఆ అరుపు విని ఆ 3 సింహాలు అతడిపై దాడి చేసాయి. దీనితో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూ వివాదం పరిష్కరించమని అడిగితే ప్రైవేట్ గదికి తీసుకెళ్లి మహిళపై అనుచితంగా పోలీసు అధికారి