Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

Advertiesment
senthil balaji

ఠాగూర్

, సోమవారం, 2 డిశెంబరు 2024 (19:30 IST)
తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మేం బెయిల్ ఇచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది అంటూ న్యాయమూర్తి అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. క్యాష్ ఫర్ జాబ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు అయ్యారు. 
 
సుధీర్ఘకాలం పాటు జైలులో ఉన్న సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన చెన్నై సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసీ సారథ్యంలోని ధర్మాసన విచారణ చేపట్టింది. 
 
మేం ఇలా బెయిల్ ఇచ్చామో లేదో అలా మీరు మంత్రి అయిపోయారు. ఇపుడీ కేసులో సాక్షుల పరిస్థితి ఏంటి? మీరు మంత్రి హోదాలో అధికార పీఠంపై ఉన్నందున సాక్షుల్లో ఆందోళన నెలకొనదా? అని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
అయితే, సెంథిల్ బాలాజీ బెయిల్‌పై పునరాలోచన లేదని, అతడి బెయిల్ రద్దు చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. కానీ సాక్షుల ఆందోళనకు గురవుతారన్న అంశాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకుంటామని, ఈ అంశం వరకు విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరువణ్ణామలైలో విరిగిపడుతున్న కొండచరియలు.. ఏడుగురు ఏమయ్యారు.. వెయ్యి అడుగుల? (videos)