Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లై ఐదు నెలలు.. శోభనానికి నో... వైద్య పరీక్షలు చేయించగా భర్తకు ఫ్యూజ్ పోయింది...

Webdunia
ఆదివారం, 14 మార్చి 2021 (13:27 IST)
వివాహమై నెలలు గడిచిపోతున్నా తన భార్యతో ఒక్క రోజు కూడా శారీరకంగా కలవలేదు. అంటే.. ఐదు నెలలు అయినా శోభనానికి మాత్రం భార్య అంగీకరించలేదు. దీంతో ఆ భర్తకు అనుమానం వచ్చి భార్యకు వైద్య పరీక్షలు చేయించగా, విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు. 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌ నగర్‌లో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని షహరాన్‌పూర్‌‌కు చెందిన యువకుడికి గతేడాది అక్టోబరు 28న ముజఫర్ నగర్‌కు చెందిన యువతితో పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాలు పెళ్లి తంతుని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
 
కొత్త కోడలు ఇంట్లోకి అడుగపెట్టడంతో వరుడి తల్లిదండ్రులు సైతం తెగ సంబరపడిపోయారు. అయితే అసలు కథ ఇప్పటి నుంచే ప్రారంభమైంది. పెళ్లైన మరుసటి రోజునే వారిద్దిరికీ శోభనం ఏర్పాటు చేశారు. కానీ, ఏవో కారణాలు చెబుతూ ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఇలాగే ఏవే కుంట సాకులు చెబుతూ.. భర్తను దగ్గరకు రానివ్వకుండా దూరంగా ఉంటూ వస్తోంది. 
 
దాంతో విసిగిపోయిన భర్త విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఆమెపై అనుమానంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య రిపోర్టును చూసిన భర్తకు, అతని కుటుంబ సభ్యులకు ఫ్యూజులు అవుట్ అయ్యాయి. కారణం.. వధువు ట్రాన్స్‌జెండర్ అని వైద్యులు తేల్చారు. ఆ రిపోర్ట్‌ను చూపుతూ అమ్మాయి కుటుంబ సభ్యులు తమను మోసం చేశారంటూ యువకుడు, అతని కుటుంబ సభ్యులు గగ్గోలు పెట్టారు. మోసం చేసి తమకు ట్రాన్స్‌జెండర్‌ను ఇచ్చి పెళ్లి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అయితే, ఆ అమ్మాయి కూడా తన అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బలవంతంగా నిర్బంధించారని ఆరోపిస్తూ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, యువకుడి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదేసమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులను కూడా స్టేషన్‌కు పిలిపించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments