Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమించాడు.. కానీ బైక్ ఇవ్వలేదని పెళ్లొద్దన్నాడు.. అంతే వధువు ఏం చేసిందంటే?

Advertiesment
ప్రేమించాడు.. కానీ బైక్ ఇవ్వలేదని పెళ్లొద్దన్నాడు.. అంతే వధువు ఏం చేసిందంటే?
, గురువారం, 11 మార్చి 2021 (17:44 IST)
అంతా పెళ్లికి రెడీ. అయితే పెళ్లికొడుకు మాత్రం తాను పెళ్లి చేసుకోనని మొండికేశాడు. అందుకు కారణం ఏంటంటే.. తనకు పెళ్లికి ముందు మోటర్ సైకిల్ కట్నంగా కావాలని డిమాండ్ చేశాడు.

అసలే తండ్రి లేని పిల్ల. సోదరుడు ఢిల్లీలో పనిచేస్తూ కొంత డబ్బులు వెనకేసి చెల్లి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి సమయంలో మళ్లీ బైక్ ఇస్తేనే పెళ్లి అని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. దీంతో మనస్తాపానికి గురైన వధువు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన షామా జహాన్ అనే యువతి.. అదే ఊరికి చెందిన అతీక్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు వారి పెళ్లికి అంగీకరించారు. అంతా అనుకున్నట్టే జరిగింది. అయితే, చివరి నిమిషంలో తాను పెళ్లి చేసుకోబోనని అతీక్ పట్టుబట్టాడు.

ఊళ్లో పెద్దలు అందరూ కలసి అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అతడి కుటుంబసభ్యులు కూడా అదే పని చేశారు. బైక్ ఇస్తేనే పెళ్లి అని తేల్చి చెప్పారు.
 
ప్రేమించిన యువకుడితో పెళ్లి జరుగుతోందని తెలిసిన యువతి.. ఇలా చివరి నిమిషంలో కట్నం కోసం అతీక్, అతని కుటుంబం పట్టుబట్టిన విషయం తెలిసిన జహాన్ ఇక తాను బ్రతకడం వృధా అని భావించింది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. పెళ్లి కూతురు చనిపోయిందనే విషయం తెలిసిన వెంటనే నిందితుడు పారిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెజవాడ దుర్గమ్మకు మంగళగిరి చేనేత పట్టువస్త్రాలు సమర్పించిన శివభక్త మార్కండేయ వంశీకులు