Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుడి ఇంట చోరీకి వచ్చి గుర్రుపెట్టి నిద్రపోయిన దొంగ...

వరుణ్
సోమవారం, 3 జూన్ 2024 (17:22 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ వైద్యుడి ఇంట దొంగతనం చేసేందుకు వచ్చేందుకు వచ్చిన ఓ దొంగ.. ఏసీ ఆన్ చేసుకుని హాయిగా నిద్రపోయాడు. మద్యం మత్తు ఎక్కువై నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారి మెలకువ వచ్చేసరికి చుట్టుముటి ఉన్న పోలీసులను చూసి అవాక్కయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లక్నో నగరంలోని ఇందిరా నగర్ సెక్టర్ 20లో సునీల్ పాండే అనే వైద్యుడి ఇల్లు ఉంది. బలరామ్ పూర్ ఆస్పత్రిలో ఆయన పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారణాసిలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఇల్లు ఖాళీగా ఉంచారు. అయితే, పాండే ఇంటి తలుపు తెరిచి ఉండటం చూసి పొరుగింటి వారికి సందేహం కలిగింది. వెళ్లి చూడగా అక్కడ ఓ దొంగ నిద్రిస్తూ కనిపించాడు. సామానంతా చెల్లాచెదురుగా పడి వుంది. దీంతో వారు వెంటనే పోలీసలకు సమాచారం అందించారు. ఈ క్రమంలో నిద్రలేచిన దొంగ తన చుట్టూత పోలీసులు ఉండటాన్ని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. 
 
నిందితుడు ఇంట్లో కనిపించిన ప్రతి వస్తువును దొంగిలించుకుపోయే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. తలుపు, కప్ బోర్డులు, పగలగొట్టాడని అన్నాడు. గ్యాస్ సిలిండర్, వాటర్ పంప్, వాష్ బేసిన్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని అన్నారు. వాటర్ పంప్, వాష్ బేసిన్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని చెప్పారు. వాటర్ పంప్ బ్యాటరీ తొలగించే క్రమంలో మద్యం మత్తు కారణంగా అతడు ఒక్కడే నిద్రపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై ఐసీసీ 379 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments