మహారాష్ట్ర రాష్ట్రంలోని బీడ్ జిల్లాలో జరిగిన ఏటీఎం దోపిడీ చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్ సినిమా సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌లోని ఒక సన్నివేశం తరహాలో ఏటీఎంకు ముసుగు ధరించిన ముఠా యంత్రానికి తాడు కట్టి కారుతో లాగడానికి ప్రయత్నిస్తోంది.
ఈ దోపిడీ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయింది. ఈ వీడియో ఆధారంగా ఉంచి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సెప్టెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున 3.00 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగింది.
మాస్కులు ధరించి ఇద్దరు వ్యక్తులు ఏటీఎంను తెరిచారు. సాధారణంగా ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టడం వంటి కార్యకలాపాలకు పాల్పడకుండా, ఈ ఏటీఎంలు యంత్రాన్ని తాడుతో లాగేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
అంతేగాకుండా సెంటర్‌లో అమర్చిన భద్రతా పరికరాలు పోలీసు శాఖను అప్రమత్తం చేయడంతో గార్డులు దోపీడీ జరిగిన ఏటీఎం కేంద్రానికి చేరుకున్నారు. అయితే పోలీసులు వచ్చేలోపే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.