Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ - పంజాబ్‌లలో ప్రశాంతంగా సాగుతున్న మూడో దశ పోలింగ్

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (12:14 IST)
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మూడో దశ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈ దశలో యూపీలో 16 జిల్లాల్లోని 59 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అలాగే, పంజాబ్ రాష్ట్రంలో 117 సీట్లకు ఆదివారం ప్రశాంతంగా పోలింగ్ సాగుతోంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. 
 
ఈ పోలింగ్ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం ఏడు గంటలకు ప్రారంభమై, సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది. కానీ పంజాబ్‌లో మాత్రం ఉదయం 8 గంటలకు ప్రారంభమైం సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. 
 
ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్‌ జరుగుతోంది. 16 జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు జరిగే మూడో దశలో 627 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా 2.15 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
 
హత్రాస్, ఫిరోజాబాద్, ఎటాహ్, కస్గంజ్, మైన్‌పురి, ఫరూఖాబాద్, కన్నౌజ్, ఇటావా, ఔరైయా, కాన్పూర్ దేహత్, కాన్పూర్ నగర్, జలౌన్, ఝాన్షీ, లలిత్‌పూర్, హమీర్‌పూర్ మరియు మహోబా జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. 
 
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయగా, ఈ రోజు కూడా అక్కడ పోలింగ్ జరగనుంది. బీజేపీ ఈ స్థానం నుంచి కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘెల్‌ను బరిలోకి దింపింది. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లతో పాటు రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments