Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి మండపంలోకి ప్రియుడు.. వరుడిని అడ్డుకుని.. నుదుటన..?

Webdunia
శనివారం, 15 మే 2021 (16:06 IST)
యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఓ కల్యాణ మండపంలో ఘనంగా వివాహ వేడుక జరుగుతోంది. వధూవరులు పూల మాలు మార్చుకోండమ్మా అంటూ పురోహితుడు చెప్పాడు. వారు దండలు మార్చుకున్నారు. ఆ తరువాత వధువు నుదుట సింధూరం దిద్దు అని వరుడికి చెప్పాడు పురోహితుడు. అదే పనిలో వరుడు ఉన్నాడు. 
 
చేతిలోకి కుంకుమ తీసుకున్నాడు. ఇంతలో ఓ యువకుడు కళ్యాణమండపంలోకి దూసుకొచ్చాడు. వచ్చీరావటంతోనే పెళ్లి మండంపైకి ఎక్కి చేతిలో కుంకుమ తీసుకుని వధువు నుదుటి మీద దిద్దబోయాడు.. దీంతో వెంటనే తేరుకున్న వరుడు అతడిని అడ్డుకోబోయాడు. దాంతో అతను కదిలావంటే చంపేస్తానంటూ గొడ్డలితో బెదిరించి..వధువు నుదుట బొట్టు పెట్టేశాడు.
 
ఇదంతా చాలా ఫాస్టుగా జరిగిపోవటంతో అందరూ షాక్ అయ్యారు. వధువుకూడా తేరుకునేలోపే జరగాల్సిందంతే జరిగింది. కాసేపటికి తేరుకున్న పెళ్లికొచ్చిన అతిధులు ''ఎవడ్రా నువ్వు..అంటూ పట్టుకుని చితకబాదారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
 
అయితే ఈ ఘటన తరువాత వరుని తరుపువారు వధువును తమతో పాటు తీసుకువెళ్లమనీ..ఆమెతో మాకు సంబంధం లేదనీ..సదరు యువకుడికి..వధువుకు మధ్య ఏదో ఉందని అందుకే అతను అంత చొరవగా వచ్చి అందరి ముందూ ఆమెకు బొట్టు పెట్టాడని మేం ఆమెను తీసుకెళ్లమని చెప్పారు. దీంతో పెద్దల పంచాయితీ జరిగింది.
 
అతను ఆమెను ప్రేమించాడు గానీ ఆమెకు మాత్రం అతను ఎవరో తెలీదని చెప్పారు. దీంతో ఎట్టకేలకు ఆ మర్నాడు అప్పగింతల కార్యక్రమం జరిగింది. వధువును వరుడు అతని బంధువులు వారి ఇంటికి తీసుకెళ్లారు. 
 
కాగా అదుపులోకి తీసుకున్న యువకుడు పిప్రాయిచ్ ప్రాంతానికి చెందిన గోలు విశ్వకర్మగా పోలీసులు గుర్తించారు. గతంలో వధువును ప్రేమించాడని.. కానీ ఆమె మాత్రం అతడిని ప్రేమించలేదనీ.. గోలు విశ్వకర్మది వన్ సైడ్ లవ్ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments