అటెండెన్స్ వేయాలంటే.. ముద్దు లంచంగా ఇవ్వాలని ఓ మహిళా ఉద్యోగిని వేధించాడు.. ఓ ఉపాధ్యాయుడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అటెండెన్స్ వేస్తానని... తన గదికి రమ్మని ఓ ఉపాధ్యాయుడు మహిళా టీచర్‌ను పిలిచాడు. చివరకు కండిషన్ పెట్టాడు.. మొత్తం అటెండెన్స్ వేసేస్తాను.. అందుకు బదులుగా తనకు ఓ ముద్దు ఇవ్వాలని కోరాడు.
ఇందుకు ఆ మహిళా టీచర్ తిరస్కరించింది. ముందు జాగ్రత్త చర్యగా తన ఫోన్‌లో ఇదంతా రికార్డ్ చేస్తుంటుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో భారీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.