Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ ఘటన: కదిలే రైలు ముందు బాలికను విసిరేశారు.. ఏమైందంటే?

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (17:10 IST)
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈవ్-టీజింగ్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన యువతి పట్ల ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరు యువకులు కదులుతున్న రైలు ముందు ఆ యువతి విసిరివేయడంతో ఆ బాలిక తన అవయవాలను కోల్పోయింది. రెండు కాళ్లు, చేయి కోల్పోయిన బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
 
మంగళవారం రాత్రి సీబీ గంజ్ ప్రాంతంలో బాలిక కోచింగ్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఇన్‌స్పెక్టర్‌, చౌకీ ఇన్‌ఛార్జ్‌, బీట్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. నిందితుల్లో ఒకరిని, అతని తండ్రిని అరెస్టు చేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం బాలికకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. బాధితురాలు ఇంటర్మీడియట్ విద్యార్థిని, సాయంత్రం కోచింగ్‌కు వెళ్లింది. అరెస్టయిన యువకుడు, అతని స్నేహితుడు ఆమెను తరచూ వేధించేవాడు.
 
 దీనిపై యువతి కుటుంబీకులు యువకుడి కుటుంబీకులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. మంగళవారం సాయంత్రం, ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా, అబ్బాయిలు మళ్లీ ఆమెపై అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ప్రతిఘటించడంతో, వారు ఆమెను కదులుతున్న రైలు ముందు విసిరారు. ఈ ఘటనతో ఆ బాలిక కాళ్లు, ఒక చెయ్యి తెగిపోయి రక్తపు మడుగులో కనిపించింది.
 
 ఆమెను రాత్రి ఇజ్జత్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మరోవైపు బాలిక పరిస్థితి విషమంగా ఉందని, ఆమె ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని ఆసుపత్రి డాక్టర్ ఓపీ భాస్కర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments