Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడిని కలిసేందుకు సమ్మతించిన తల్లి.. విషమిచ్చి చంపేసిన కుమార్తె.. ఎక్కడ?

Advertiesment
poison
, సోమవారం, 9 అక్టోబరు 2023 (10:59 IST)
తన ప్రియుడిని కలుసుకునేందుకు కన్నతల్లి అడ్డుపడసాగింది. దీన్ని జీర్ణించుకోలేని కుమార్తె.. కన్నతల్లికి విషమిచ్చి చంపేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని రాయ్‌బరేలీ ప్రాంతానికి చెందిన సంగీత యాదవ్ (48) అనే మహిళకు 16 యేళ్ల మైనర్ బాలిక ఉంది. ఈ బాలిక కొంతకాలంగా ఓ యుకుడితో ప్రేమలో మునిగి తేలుతుంది. దీన్ని పసిగట్టిన తల్లి... కుమార్తెను మందలించింది. పైగా ఆ అబ్బాయితో కలుసుకోవద్దని, మాట్లాడవద్దంటూ ఆంక్షలు విధించింది. తల్లి మాటలు ఆ బాలికకు ఏమాత్రం రుచించలేదు. అప్పటి నుంచి తల్లిపై కోపం పెంచుకోసాగింది. 
 
ఈ క్రమంలో తనకు, తన ప్రియుడికి తల్లి అడ్డుగా ఉందని భావించిన ఆ బాలిక... తీవ్ర నిర్ణయం తీసుకుంది. తల్లిని అడ్డుతొలగించుకోవాలని పథక రచన చేసింది. మార్కెట్ నుంచి విషం తీసుకుని రావాలని తన బాయ్ ఫ్రెండ్‌కు చెప్పింది. తల్లి తాగే టీలో విషం కలిపి ఇచ్చింది.
 
ఆ టీ తాగిన సంగీతా యాదవ్ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయితే, ఈ పరిణామంతో భయపడిపోయిన కుమార్తె పొరుగువారికి విషయం చెప్పింది. దాంతో వారు సంగీతా యాదవ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలకు ముప్పులేదని పోలీసులు తెలిపారు.
 
ఈ వ్యవహారంలో పోలీసులు టీనేజ్ అమ్మాయి, ఆమెకు సహకరించిన ప్రియుడిపై సెక్షన్ 328 కింద కేసు నమోదు చేశారు. బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, పరారీలో ఉన్న బాయ్‌ఫ్రెండ్ కోసం గాలింపు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంగవీటి రాధాకృష్ణ పెళ్లి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?