Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోపుడు బండి వస్త్ర వ్యాపారికి ఇద్దరు బాడీగార్డులు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 20 జులై 2022 (09:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తోపుడు బండిపై వస్త్రాలు అమ్ముకుంటూ పొట్టపోసుకునే ఓ చిరు వ్యాపారికి ఇద్దరు బాడీ గార్డులు ఉన్నారు. వారిద్దరూ తుపాకీలు చేతబట్టి ఆయనకు రక్షణగా ఉంటున్నారు. ఆయన వీధి వీధి తిరుగుతూ వస్త్రాల విక్రయిస్తుంటే ఆ సాయుధ బాడీగార్డులు ఆయనకు రక్షణగా ఉంటున్నారు. ఈ కథనం వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ఎటా జిల్లా చెందిన రామేశ్వర్‌ దయాల్‌ అనే వ్యక్తి తోపుడు బండిపై బట్టల వ్యాపారం చేస్తుంటారు. తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్‌ సింగ్‌ సోదరుడు జుగేంద్ర సింగ్‌ను కలిశాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. కులం పేరుతో జుగేంద్ర తనను దూషించారని రామేశ్వర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జుగేంద్ర నుంచి ఆయనకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. 
 
మరోవైపు, తనకు పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ జుగేంద్ర హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే దయాల్‌ను కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. కోర్టుకు వచ్చిన దయాల్‌ను చూసిన న్యాయమూర్తి ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ బాధితుడికి ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను ప్రశ్నించారు. ఇద్దరు బాడీగార్డులను భద్రతగా నియమించాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments