ఎన్నికల్లో ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈ ఉచితాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడమే కాకుండా దేశ భవిష్యత్‌నూ నిర్మిస్తోందని ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ రీజియన్‌లో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిని శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఈ ఎక్స్‌ప్రెస్ వేతో చిత్రకూట్ నుంచి ఢిల్లీకి ప్రయాణం 3, 4 గంటలు తగ్గడమే కాకుండా పారిశ్రామికంగా బుందేల్‌ఖండ్ పరుగులు పెడుతుందన్నారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతలు మెరుగపడటమేకాకుండా, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ అన్నారు. ఇదంతా డబుల్ ఇంజిన్ సర్కారుతోనే సాధ్యమవుతోందని పేర్కొన్నారు.
కాగా, 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ రహదారిని రూ.14,850 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ రహదారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని 7 జిల్లాలను కలుపుతుంది. గతంలో నాలుగు లైన్లు ఉండగా ప్రస్తుతం ఆరు లైన్లకు విస్తరించారు. ఈ రహదారి ద్వారా చిత్రకూట్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ఆరు గంటల్లోనే చేరుకోవచ్చు.