Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురాద్ నగర్ ఘటన కారకులపై ఎన్.ఎస్.సి కింద చర్యలు : సీఎం యోగి

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (20:59 IST)
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘజియాబాద్‌లో మురాద్ నగర్‌లో జనవరి 3న ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్మశానవాటికలోని కాంప్లెక్స్ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 21 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. 
 
ఈ మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు తలా పది లక్షల రూపాయలు అందించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఘటనకు కారకులైన వారిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 
 
కాగా… ఓ వ్యక్తి అంత్యక్రియలో పాల్గొనేందుకు బంధవులంతా శ్మశాన వాటికకు వచ్చారు. అదేసమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో వారంతా ఆ శ్మశాన వాటికలో ఉన్న కాంప్లెక్స్ గ్యాలరీలో తలదాచుకున్నారు. 
 
అయితే అది కొత్తగా నిర్మించినది కావడం, భారీ వర్షం కారణంగా పూర్తిగా నానడంతో గ్యాలరీ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో దానికింత తలదాచుకున్న వారంతా అందులో చిక్కుపోయారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments