Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రైవేట్ ఆసుపత్రులకు ఏపి ప్రభుత్వం హెచ్చరిక

ప్రైవేట్ ఆసుపత్రులకు ఏపి ప్రభుత్వం హెచ్చరిక
, గురువారం, 29 అక్టోబరు 2020 (06:30 IST)
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం కింద రిజిస్టర్ అయిన కొన్ని హాస్పిటళ్లు రోగులను ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం కింద అడ్మిట్ చేసుకోవడం లేదు మరియు కాష్ పేమెంట్ కింద అడ్మిట్ చేసుకుంటున్నారు.

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం కింద అందుబాటులో ఉన్న చికిత్సలకు మెడికల్ రీయింబర్సుమెంట్ పెట్టుకోమని సలహాలు ఇవ్వడం జరుగుతున్నదని, ముఖ్య కార్యనిర్వహణ అధికారి, డా.వై.ఎస్.ఆర్.ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దృష్టికి వచ్చినది.
 
ఈ సందర్బంగా ఎంపానెల్ హాస్పిటల్ కి కింద సూచనలు చేయడమైనది.
హాస్పిటల్ యొక్క బకాయిలను డా.వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దాదాపు చెల్లించడం జరిగినది.ఈ నెలలో 13.10.2020 వ తేదీనాడు 31కోట్లు విడుదల చేయడం జరిగినది. రానున్న కొద్దీ రోజులలో మరో 16కోట్లు విడుదల చేయబోతున్నది.

ఉద్యోగుల నెలసరి కాంట్రిబ్యూషన్ ను Rs.90/- మరియుRs.120/-నుండి Rs.225/-  మరియు Rs.300/- కి పెంచడం జరిగినది.అలాగే ఉద్యోగస్తులకు మరియు పెన్షనర్లకు మంచి వైద్యసేవలు అందించుటకు గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ని కూడా అదే మోతాదులో పెంచడం జరిగినది.

ఈ సందర్బంగా హాస్పిటల్ కి హెచ్చరించడం ఏమనగా, రోగులను సరిగా కౌన్సిల్ చేసి, వారిని మెడికల్ రీయింబర్సుమెంట్ పెట్టుకోమని సూచించకుండా, రోగులను ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం కింద మాత్రమే చేర్చుకోవల్సిందిగా ఆదేశించడమైనది.

హాస్పిటల్ లో రోగుల చికిత్సల కొరకు డబ్బులు తీసుకోవడం లేదా రోగులను అడ్మిట్ చేసుకోకపోవడంలేదా ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం కింద అందుబాటులో ఉన్న రోగాలకు క్యాష్పేమెంట్ కింద అడ్మిట్ చేసుకోవడం లాంటివి ముఖ్య కార్య నిర్వహణ అధికారి, డా.వై.ఎస్.ఆర్.ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దృష్టికి వచ్చిన యెడల కింద సూచించిన విదంగా చర్యలు తీసుకొనబడును. 

1 . హాస్పిటల్ లో రోగుల వద్ద తీసుకున్న డబ్బులకి 10 రెట్లు పెనాల్టీ వేయబడును.
2 . హాస్పిటల్ ని అన్ని స్కీమ్ ల నుండి 3 నెలలు పాటు సస్పెండ్ చేయబడును.
 
ఈ సందర్బంగా అన్ని నెట్ వర్క్ హాస్పిటల్ లకి తెలియజేయడమేమనగా పైన సూచించిన సూచనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి తేల్చి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్మృతి ఇరానీకి కరోనా : ఏపీలో కొత్త పాజిటివ్ కేసులెన్ని?