ఒంటిపై చేయివేశావో... నిన్ను 35 ముక్కలు చేస్తా.. శోభనం రాత్రి భర్తకు భార్య వార్నింగ్...

ఠాగూర్
బుధవారం, 25 జూన్ 2025 (09:50 IST)
లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో సంతోషంగా వివాహం చేసుకున్న పెళ్ళి కొడుక్కి శోభనం రాత్రి భార్య ఇచ్చిన బెదిరింపుతో అవాక్కయ్యాడు. తనపై చేయి పడితే.. నీ శరీరాన్ని
35 ముక్కలు చేస్తానంటూ హెచ్చరించింది. దీంతో వరుడు ఏం చేయాలో దిక్కు తోచక మిన్నకుండిపోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రయాగ్ రాజ్‌కు చెందిన నిషాద్ అనే వ్యక్తికి ఇటీవల సితార అనే యువతితో వివాహమైంది. పెళ్లి సమయంలో ఆనందంగానే కనిపించిన వధువు.. శోభనం రోజు రాత్రి మాత్రం వింతగా ప్రవర్తించింది. శోభనం గదిలోకి పాల గ్లాసుతో రావాల్సిన వధువు.. కత్తితో వచ్చి నన్ను తాకితే నిన్ను 35 ముక్కలు చేస్తా. తనకు ఈ పెళ్ళి ఏమాత్రం ఇష్టంలేదు. తాను అమన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్ళిచేసుకుంటా. పైగా, ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్త, అతని కుటుంబ సభ్యులపై కూడా బెదిరింపులకు పాల్పడింది.
 
దీంతో మరుసటి రోజు వారు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. సితారకు తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ వేధింపులు ఆగలేదు. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, సితార తన ప్రియుడు అమన్‌తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. 
 
ప్రస్తుతం సితార, అమన్‌ల కోసం గాలిస్తున్నారు. సితారకు అమన్ వరుసకు మేనల్లుడు కావడం గమనార్హం. మేఘాలయ హనీమూన్‌కు వెళ్లిన భర్తను సోనమ్ రఘువంశీ తన ప్రియుడుతో కలిసి హత్య చేయించిన నేపథ్యంలో ఈ ఘటన ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments