Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేత లాడ్జిలో వ్యభిచారం.. అందమైన యువతులను రప్పించి...

ఠాగూర్
బుధవారం, 25 జూన్ 2025 (09:17 IST)
విజయవాడ గవర్నర్‌పేట, అట్టా రత్తయ్య వీధిలోని వైకాపా నేత కోసూరి సుబ్రహ్మణ్యం అలియాస్ మణికి చెందిన లాడ్జిలో గుట్టుగాసాగుతూ వచ్చిన వ్యభిచార తంతును స్థానిక పోలీసులు బహిర్గతం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అందమైన యువతులను పిలిపించి, వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సోమవారం అర్థరాత్రిదాటిన తర్వాత పోలీసులు ఆ లాడ్జిలో మెరుపు తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించారు. దీంతో నిర్వాహకుడు ఆండ్రాజు బాలకృష్ణతో పాటు చిన్నం రంగా సాయినాథ్ తేజ, భూక్యా పూర్ణచంద్రరావు, అంగలూరి వంశీకృష్ణతో పాటు భవన యజమాని కోసూరి సుబ్రహ్మణ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
ఈ కేసులో ఐదుగురిని నిందితులుగా చేర్చారు. వీరిలో భవన యజమాని అయిన వైకాపా నేత మణిని ఐదో నిందితుడుగా చేర్చారు. నిర్వాహకుడు బాలకృష్ణ పేరును మొదటి నిందితుడుగా చేర్చారు. అలాగే, ఏ2గా చిన్నం రంగాసాయినాథ్ తేజ, ఏ3గా వంశీకృష్ణ, ఏ4గా పూర్ణచంద్రరావుల పేర్లను చేర్చారు. 
 
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, కర్నాటకల నుంచి యువతులను తీసుకొచ్చి వారికి డబ్బు ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దించేవారని పోలీసులు చెబుతున్నారు. యవతుల ఫోటోలను ఆన్‌లైన్‌లో ఉంచి విటులను ఆకర్షించేవారు. ఫోనులో సంప్రదించిన వారిని రహస్యంగా గవర్నర్ పేటలోని శ్రీసాయి మణి లాడ్జికి తీసుకొచ్చేవారు. ఆ తర్వాత నాలుగో అంతస్తులో ఉన్న యువతుల వద్దకు పంపి వ్యభిచారం చేయించేవారని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments