తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి లత అనే మహిళతో సహా మొత్తం ఆరుగురుని అరెస్టు చేశారు. మైనర్‌లతో వ్యభిచారం చేయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడిన ఓ మహిళ ఈ పాడుపనికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ముఠాలోని ఓ యువతి ఇన్‌స్టాఖాతా ద్వారా మైనర్ బాలికలను ట్రాప్ చేసి, ఆపై మైనర్లకు మద్యం, గంజాయి అలవాటు చేసి వారిని నర్సంపేటకు తీసుకెళ్లి వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు.
ఈ ముఠా నుంచి ఒక కేజీ గంజాయి, 4300 కండోమ్స్ ప్యాకెట్లు, రూ.75 వేల నగదు, ఓ కారు, మైబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితురాలు లత కాగా, ఆమె సభ్యులుగా అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, మొహ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్‌లు ఉన్నారు. వీరందరినీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ముఠా నుంచి పలువురు మైనర్ బాలికలను పోలీసులు రక్షించారు. కాగా, ఈ కేసులో అరెస్టు చేసిన మైనర్ బాలికలను పోలీసులు రక్షించారు.