అనకాపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. హత్య చేసిన మహిళను బెడ్ షీటులో రెండు చేతులు, రెండు కాళ్లను కట్టేసి పడేశారు. మహిళను హత్య చేసి, శరీర భాగాలు వేరు చేసి పడేసారని గుర్తించారు. బెడ్ షీటులో చుట్టిన మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు.
అసలు హత్యకు గురైంది ఎవరు అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా పోలీసు అధికారులు సీసీ కెమెరా ఆధారంగా, అలాగే వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల పరిశీలన ద్వారా కేసు దర్యాప్తు చేస్తామని కశింకోట సీఐ స్వామి నాయుడు తెలిపారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. దీనిపై తక్షణమే విచారణ చేసి, నిందితులను అరెస్ట్ చేయాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.