Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనకాపల్లి జిల్లాలో కుంగిన వంతెన - రైళ్ల రాకపోకలకు అంతరాయం!

Advertiesment
railway-bridge-damaged

ఠాగూర్

, సోమవారం, 17 మార్చి 2025 (09:48 IST)
అనకాపల్లి జిల్లాలో ఓ రైల్వే వంతెనకుంగింది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయరామరాజుపేట వద్ద దెబ్బతిన్న రైల్వే వంతెన, రైల్వే వంతెన కింద నుంచి వెళుతుండగా గడ్డర్‌ను భారీ వాహనం ఢీకొట్టింది. దీంతో రైళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. వంతెన కింద నుంచి భారీ వాహనాలు వెళ్ళకుండా పెట్టిన గడ్డర్‌ను ఆదివారం రాత్రి క్వారీ లారీ వెళ్తూ గడ్డర్‌ను ఢీకొట్టింది. దీంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. అయితే, విశాఖ - విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 
 
దీంతో అధికారులు 8 రైళ్లను నిలిపివేశారు. అనంతరం మరో ట్రాక్ మీదుగా విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. కశింకోట వద్ద గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపేశారు. యలమంచిలిలో పాలమూరు ఎక్స్‌ప్రెస్ నిలిపేశారు. వంతెన దెబ్బతిన్న దృష్ట్యా సింహాద్రి, అమరావతి ఎక్స్‌ప్రెస్, విశాఖ, గోదావరి ఎక్స్‌ప్రెస్, మహబూబ్ నగర్, గరీబ్ రథ్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 
 
దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. రైల్వే వంతెన కింది భాగంలో తరచూ అధిక లోడుతో వెళుతున్న భారీ వాహనాల వల్ల ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నాయి. సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 
 
అనకాపల్లి జిల్లా రైల్వే వంతెన దెబ్బతిన్న దృష్ట్యా పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్ల ఆలస్యం విశాఖ స్టేషన్‌లో అధికారుల సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సమాచారం కోసం హెల్ప్ నంబర్లను ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ప్రజలకు శుభవార్త : ఐదేళ్ల తర్వాత తగ్గనున్న విద్యుత్ చార్జీలు