సోనియా గాంధీ ఇటలీలో నృత్యకారిణి : బీజేపీ ఎమ్మెల్యే

Webdunia
ఆదివారం, 24 మార్చి 2019 (16:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు  సోనియా గాంధీ ఇటలీలో ఓ నృత్యకారిణి అని అన్నారు. అలాగే, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డ్యాన్సర్ సాప్న చౌదరిని పెళ్ళి చేసుకోవాలని సూచించారు. 
 
ప్రముఖ డ్యాన్సర్, గాయని సప్నా చౌదరి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరింది. దీనిపై యూపీకి చెందిన ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మాట్లాడుతూ, రాహుల్ తల్లి సోనియా ఇటలీలో నృత్యకారిణిగా ఉండేవారన్నారు. ఆమెను రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకున్నారని చెప్పారు. ఇప్పుడు సప్నా చౌదరిని రాహుల్ కూడా పెళ్లి చేసుకోవాలని సూచించారు. తద్వారా అత్తాకోడళ్లు, ఒకే వారసత్వం, సంస్కృతి, వృత్తికి చెందినవారు అవుతారని ఎద్దేవా చేశారు.
 
'కాంగ్రెస్ చీఫ్ రాహుల్ తన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడాన్ని స్వాగతిస్తున్నాం. రాహుల్ తల్లి ఇటలీలో ఇదే వృత్తిలో ఉండేవారు. ఆమెను రాజీవ్ తన మనిషిని  చేసుకున్నారు. ఇప్పుడు రాహుల్ సప్నాను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని తన మనిషిని చేసుకున్నారు. రాహుల్ ఆమెను పెళ్లి చేసుకోవాలి. అప్పుడే అత్తాకోడళ్లు ఒకే సంస్కృతి, వృత్తికి చెందినవారు అవుతారు. భారత ప్రజలు ఓ నర్తకికి దేశాన్ని నడిపే అవకాశం ఎన్నటికీ ఇవ్వరు. అందుకే సమర్థుడు, నిజాయితీపరుడైన మోదీకి ప్రజలు అధికారం అప్పగించారు' అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments