Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వతంత్ర అభ్యర్థిగా సుమలత... ప్రచారానికి చిరంజీవి - రజినీకాంత్

Webdunia
ఆదివారం, 24 మార్చి 2019 (14:51 IST)
తనకు లోక్‌సభ టిక్కెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు సినీ నటి మలత నిర్ణయించుకున్నారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో ఆమెకు అనూహ్య మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా, సుమలతకు బీజేపీ కూడా మద్దతు ప్రకటించింది. 
 
కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు. ఆమెకు దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించకుండా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ బరిలో ఉన్నారు.
 
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సుమలతకు సినీ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. ఆమె కోసం ప్రచారం చేసేందుకు ముందుకొస్తున్నారు. ‘కేజీఎఫ్’ హీరో యశ్ ఇప్పటికే సుమలతకు మద్దతు ప్రకటించగా, తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ కూడా ముందుకొచ్చారు. 
 
మరోవైపు టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, మోహన్‌బాబు కూడా సుమలతకు ప్రచారం చేయాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తోంది. సినీ ప్రముఖులందరూ సుమలత కోసం బరిలోకి దిగుతుండడంతో కాంగ్రెస్ - జేడీఎస్ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

అతివృష్టి లేదంటే అనావృష్టి : ఈ శుక్రవారం ఏకంగా 10 చిత్రాలు విడుదల...

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments