Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ .. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తాం : మంత్రి ధర్మేంద్ర

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (12:37 IST)
నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తామని కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నీట్ యూజీ ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. ఈ తీర్పుపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయింది వాస్తవమేనని, అయితే చాలా కొద్ది స్థాయిలోనే లీక్ కావడం వల్ల, మళ్లీ నీట్ పరీక్ష జరపాల్సిన అవసరం లేదని ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. 
 
నీట్ పేపర్ లీక్ పరిమితి స్థాయిలోనే జరిగిందని తాము మొదటి నుంచి చెబుతున్నామని, తాము ఎప్పటి నుంచో చెబుతున్నదే ఈ రోజు సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు. అయితే, నీట్ పేపర్ లీక్ అంశంపై విపక్షాలు అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. 
 
సత్యమే గెలిచిందని, అందువల్ల నీట్ ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొనడం హర్షణీయమని తెలిపారు. ఇక, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో, మరో రెండు రోజుల్లో నీట్ యూజీ ఫలితాలను ఎన్టీయే విడుదల చేస్తుందన్నారు. అత్యున్నత న్యాయస్థానం పరిశీలించిన మేరకు నీట్ యూజీ మెరిట్ లిస్టును సవరిస్తామని మంత్రి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments