'కల్కి' సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ ఆ పాత్రలో సరిగా సూట్ అవ్ లేదంటూ... తన డైలాగ్ డెలివరీ బాలేదంటూ.. సోషల్ మీడియాలో అతనిపై నెటిజెన్స్ కొందరు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అయితే తన సోషల్ మీడియా హ్యాండిల్స్ డీపీలో ట్రోలింగ్ చేస్తున్న గెటప్ ఫొటోనే పెట్టాడు విజయ్. కాగా ఇప్పుడు ఆ పాత్ర గురించి అతను ఓ కార్యక్రమంలో స్పందించారు. ఈ చిత్రాన్ని ఆదివారం రాత్రి ఆయన తిలకించారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, కల్కిలో అర్జునుడి పాత్రకు వస్తున్న స్పందన చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పాత్రను తాను కేవలం దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ఉన్న స్నేహం, ప్రభాస్ మీద ఉన్న అభిమానంతోనే చేసినట్లు విజయ్ తెలిపాడు.
తాను సినిమా చూశానని.. సినిమాకు అందులో తన పాత్రకూ మంచి స్పందన లభిస్తోందని తెలిపాడు. కల్కి మూవీతో తెలుగు సినిమా స్థాయి పెరిగిందని.. ఇంత భారీ ప్రాజెక్టులో తాను కూడా భాగం కావడం గర్వంగా అనిపిస్తోందని విజయ్ తెలిపాడు. తాను సినిమాలో కనిపించింది తక్కువ సమయమే అయినా.. దాని ఇంపాక్ట్ బాగా ఉందన్నాడు.