Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాపీగా బెడ్‌పై పడుకుంటే.. ఒకటే దుర్వాసన.. తర్వాత షాక్.. ఎందుకు?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (12:12 IST)
రోజంతా బయటి పని ముగించుకుని.. ఇంటకొచ్చి బెడ్ మీద హాయిగా నిద్రపోవాలనుకున్నాడు. ఇలా ప్రతిరోజూ హాయిగా బెడ్‌పై నిద్రపోతున్న వ్యక్తికి ఓ రోజు బెడ్ నుంచి భరించలేనంత దుర్వాసన వచ్చింది. దీంతో ఎలుకేదైనా చచ్చిందా అనుకుని బెడ్డెత్తి చూసిన ఆ వ్యక్తి షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బీహార్‌లోని గయకి చెందిన దినేష్ కుమార్ అనే టీ వ్యాపారి వద్ద రాజేష్ కుమార్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 
 
రాజేశ్ తన భార్య బబితతో కలిసి యజమానికి చెందిన ఇంట్లోనే అద్దెకు ఉంటున్నాడు. కాగా, ఇటీవల ఏదో పని మీద దినేశ్ దగ్గర్లోని ఓ పట్టణానికి వెళుతూ ఇంటి తాళాలు రాజేశ్‌కు ఇచ్చాడు. వారం తర్వాత ఇంటికి వచ్చిన దినేశ్ ఎప్పటిలాగానే తన బెడ్‌పై పడుకున్నాడు. ఈ రోజు ఏదో వాసనగా అనిపించినప్పటికీ అలాగే పడుకున్నాడు. దుర్వాసన మరీ ఎక్కువ రావడంతో దినేశ్ తన బెడ్‌ను ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు. 
 
బెడ్ కింద కుళ్లిన స్థితిన మహిళ మృతదేహం కనిపించింది. ఆ మృతదేహాన్ని తన డ్రైవర్ రాజేశ్ భార్య బబితగా గుర్తించాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను భర్త రాజేశే చంపి ఉంటాడని భావిస్తున్నారు. మృతురాలి తండ్రి కూడా తమ కుమార్తెను రాజేషే హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ఇంకా పరారీలో వున్న రాజేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పేక మేడలు నుంచి ఫస్ట్ సింగిల్ 'బూమ్ బూమ్ లచ్చన్న సాంగ్ విడుదల

కాశీ, కాంప్లెక్స్, శంబాలా గురించి రివిల్ చేసిన కల్కి 2898 AD రిలీజ్ ట్రైలర్

అడవి శేష్ పేరు మారిపోయింది.. ఇందుకు సన్నీ లియోన్‌నే కారణమా?

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments