Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పు చెల్లించలేదనీ స్నేహితుడుని చంపి 200 ముక్కలు చేశాడు... ఎక్కడ?

Advertiesment
అప్పు చెల్లించలేదనీ స్నేహితుడుని చంపి 200 ముక్కలు చేశాడు... ఎక్కడ?
, గురువారం, 24 జనవరి 2019 (18:06 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. లేటు వయసులో పెళ్లి చేసుకుంటున్న స్నేహితుడుని కించపరచడమేకాకుండా, ఊహించనివిధంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని 200 ముక్కలు చేసి టాయిలెట్‌లో వేశాడో స్నేహితుడు. ఈ విషయం మున్సిపాలిటీ సిబ్బంది డ్రైనేజీ క్లీన్ చేస్తుండగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం ముంబైకు సమీపంలోని బచ్‌రాజ్ ప్యారడైజ్ సొసైటీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబై శాంతాక్రజ్‌కు చెందిన పింటూ శర్మ. వయసు 42 యేళ్లు. ఈయనకు గణేశ్ విఠల్ అనే స్నేహితుడు ఉన్నాడు. వయసు 58 యేళ్లు. అయితే, గణేశ్ లేటు వయసులో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ పెళ్లి ఖర్చుల కోసం పింటూ శర్మ వద్ద గణేష్ లక్ష రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. 
 
మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సివుంది. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీన గణేశ్‌ను పింటూ తన గదికి పిలిపించుకున్నాడు. వారిద్దరూ కలిసి పార్టీ చేసుకున్నాడు. వారిమధ్య జరిగిన సంభాషణల్లో.. లేటు వయసులో పెళ్లి చేసుకుంటున్నావు.. నీ పెళ్లాం నీతో ఉంటుందో.. లేచిపోతుందోనంటూ గణేశ్‌ను పింటూ శర్మ హేళనగా మాట్లాడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గణేశ్ ప్రాణాలు కోల్పోయాడు. 
 
దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పింటూ శర్మ.. ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు గణేశ్ మృతదేహాన్ని చిన్నచిన్నవిగా హాక్సాబ్లేడుతో 200 ముక్కలుగా కోశాడు. వాటిలో కండతో ఉన్న ముక్కలను టాయి‌లెట్‌లో వేసి నీళ్లు పోశాడు. ఎముకలను మాత్రం ఓ మూటగట్టి.. ఎవరూ గుర్తుపట్టరాని చోటపడేశాడు. 
 
ఇంతలో డ్రైనేజీ నీళ్లు పోకపోవడంతో కాలనీ వాసులు మున్సిపాలిటీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు వచ్చి డ్రైనేజీని పైపులను క్లీన్ చేస్తుండగా, చిన్నచిన్న మాంసపు ముక్కలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగడంతో అసలు నిజం వెల్లడైంది. దీంతో పింటూను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్యుడు ప్రతాపానికి 100 గుర్రాలు మృతి... ఎక్కడ?