Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏరా... నీ.. య... ఏ పెడ్తున్నావురా... యువకుడిని చితక్కొట్టిన మహిళ (Video)

ఏరా... నీ.. య... ఏ పెడ్తున్నావురా... యువకుడిని చితక్కొట్టిన మహిళ (Video)
, గురువారం, 24 జనవరి 2019 (16:40 IST)
చిత్తూరులో ఫేస్ బుక్‌లో అశ్లీల పోస్టు చేసినందుకు గొడవపడిన కేసులో ఏడుగురుని అరెస్ట్ చేశారు పోలీసులు. చిత్తూరు పట్టణములో సాధిక్ అనే అబ్బాయిని మిట్టూరు నందు నివాసముంటున్న ఒక మహిళ ఆమె కుమారుడు ఫేస్ బుక్‌లో ఒక అమ్మాయి గురించి అశ్లీల పోస్టులు చేసినందుకు ఇంటికి పిలిపించి తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత ఆమె కుమారుడు, అతని మిత్రులు మిట్టూ లోని ఒక కళ్యాణ మండపం వద్దకు తీసుకొని వెళ్లి చితకబాదారు. 
 
ఈ కేసు విషయంలో చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేసి ఈ కేసుకు సంబంధించిన 9 మందిలో ఏడు గురిని  అరెస్ట్ చేసి అందులో 3 మేజర్లు ఉండడం వలన JFCM కోర్టులో హాజరుపరిచారు. వీరిలో మిగిలిన నలుగురు మైనర్లు కావడం వలన తిరుపతి నందు గల జువెనైల్ హోంకు తరలించారు. నేటి ఆధునిక సమాజంలో టెక్నాలజీ రెండు వైపులా పదునైన కత్తి. 
 
సాంకేతికతో ఎంత మంచి జరుగుతుందో చెడు కూడా అంతే జరిగే ఆస్కారం ఉంది. తల్లితండ్రులు తమ పిల్లల పెంపకంపైన సరైన పర్యవేక్షణ లేనప్పుడే ఇలాంటి గొడవలకి ఆస్కారం పుంటుంది. కాబట్టి తల్లదండ్రులు తమ పిల్లల పట్ల సరైన దృక్పధంతో తరచూ వారి అలవాట్లను, ఆన్లైన్‌లో వారు చేసే కార్యకలాపాలను గమనిస్తూ ఉండి జాగ్రత్తలు తీసుకుంటూ వారిని సభ్యసమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే దిశలో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి వీడియో...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌తో టిడిపి మైండ్‌ గేమ్‌..? ఏంటది?