చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కోళ్ళ దొంగతనం చేస్తున్నాడన్న నెపంతో 5 రోజులుగా ఒక యువకుడిని గృహ నిర్బంధం చేసి చితకబాదారు. చిత్తూరులో నివాసమున్న వేణుగోపాల్ స్థానికంగా ఉన్న సాగర్ చికెన్ పౌల్ట్రీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి కోళ్ళు దొంగతనం జరుగుతున్నట్లు యజమాని గుర్తించారు.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	అనుమానం వచ్చిన పౌల్ట్రీ యజమాని వర్కర్లతో  వేణుగోపాల్‌ను చితకబాది తన ఇంటిలో నిర్బంధించాడు. పౌల్ట్రీ నిర్వాహకుల నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధితుడు మీడియాను  ఆశ్రయించాడు.