Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం - రాష్ట్రంలో వంట నూనెల భగ్గు

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (07:59 IST)
ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలైంది. గురువారం నుంచి ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుంది. ఈ దాడులను ఉక్రెయిన్ సమర్థంగా ఎదుర్కొంటూ, రష్యాకు చెందిన ఫైటర్ జెట్లపై ప్రతి దాడులు చేస్తుంది. అయితే, ఈ యుద్ధ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే భారత్ సహా అనేక ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. 
 
అమెరికా డాలరు విలువ గణనీయంగా పడిపోయింది. అదేసమయంలో వివిధ రకాలైన వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. నిజానికి ఇప్పటికిపుడు ఎలాంటి కొరత లేకున్నప్పటికీ వ్యాపార వర్గాలు మాత్రం కృత్రిమ కొరతకు తెరరీశాయి. దంతో ఒక్క రోజులోనే వంట నూనెల ధరలు భగ్గుమన్నాయి. 
 
గురువారం రాష్ట్రంలో పామాయిల్, సన్‌ఫ్లవర్, ఇతర అన్ని రకాల వంట నూనెల ధరలు ఒకేసారి లీటరుకు రూ.10 మేరకు పెంచేశారు. బుధవారం వరకు వినియోగదారులకు పామాయిల్ ధర సగటున రూ.135గా ఉండగా అది గురువారానికి రూ.145కు చేరుకుంది. అలాగే, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.138 నుంచి రూ.150కు చేరుకుంది. హోల్‌సేల్ వ్యాపారాలు కూడా అంతే స్థాయిలో ధరలు పెంచారని పేర్కొన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరిన్ని రోజులు కొనసాగిన పక్షంలో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments