ఉక్రెయిన్ నుంచి తిరిగివచ్చిన విద్యార్థులకు ఉక్రెయిన్ శుభవార్త

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (14:18 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ వార్ కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థులకు ఉక్రెయిన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. న్యూఢిల్లీ పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్ దేశ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఓ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ దేశంలోని యూనివర్శిటీల్లో విద్యాభ్యాసం చేస్తూ యుద్ధం కారణంగా భారత్‌కు తిరిగివచ్చిన విద్యార్థులకు స్వదేశంలోనే పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. స్వదేశానికి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులను భారత్ నుంచే కీలక పరీక్షలు రాసేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. అలాగే, ఇంటిపట్టు నుంచే ఆన్‌లన్ తరగతులకు హాజరయ్యేందుకు కూడా అనుమతిస్తామని తెలిపారు.
 
కాగా, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో నివసిస్తూ వచ్చిన అనేకమంది ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశ సరిహద్దులను దాటారు. మరోవైపు, వైద్య విద్యను అభ్యసించడానికి భారత్ నుంచి దాదాపు 20 వేల మంది విద్యార్థులు వెల్లారు. వీరి విద్యాభ్యాసం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఉక్రెయిన్‌పై రష్యా తిరుగుబాటు చర్యతో అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి వారి పరిస్థితి ఇపుడిపుడే కుదుటడుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments