Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేసిన ఈడీ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (12:50 IST)
ప్రముఖ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ బీబీసీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేసిది. ఈ కేసులో ఆర్థిక లావేదేవీల వివరాలను సమర్పించాలని బీబీసీ ఇండియా యాజమాన్యాన్ని ఆదేశించింది. అదేవిధంగా ప్రసాసుల నుంచి అందిన నిధులు (విదేశీ రెమిటెన్సుల) వివరాలను కూడా వెల్లడించాలని కోరారు. 
 
కాగా, గుజరాత్ రాష్ట్రంలో జరిగిన గోద్రా అల్లర్ల వెనుక నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రమేయం ఉందంటూ ఒక వివాదాస్పద డాక్యుమెంటరీని రూపొందించి ప్రసారం చేసింది. దీన్ని భారత్‌లో ప్రసారం చేయకుండా కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే బీబీసీ ఇండియా కార్యాలయంలో ఈడీ తనిఖీలు మొదలయ్యాయి. ఇది పెద్ద వివాదం కావడంతో ఈడీ వివరణ ఇస్తూత ఇవి సోదాలు కాదు.. వివరణ అంటూ వివరణ ఇచ్చింది. 
 
ఇండియా : ద మోడీ క్వశ్చన్ పేరితో ఈ డాక్యుమెంటరీని రెండు భాగాలుగా తయారు చేసింది. అల్లర్లపై న్యాయస్థానాల్లో మోడీకి క్లీన్‌చిట్ లభించిన తర్వాత కూడా అభాండాలు వేయడం ఏమిటని బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, విపక్ష నేతలు మాత్రం ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా, బీబీసీ ఇండియా ప్రసారం చేసిన డాక్యుమెంటరీని సమర్థిస్తూ వారు ప్రసంగాలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments