Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహ విందు: చికెన్ బిర్యానీలో లెగ్ పీసులు ఎక్కడ..? కొట్టుకున్న అతిథులు!

సెల్వి
బుధవారం, 26 జూన్ 2024 (19:51 IST)
వివాహాల్లో విందు అంటేనే చాలామంది ఆత్రుతగా టేస్ట్ చేస్తారు. వెజ్ వంటకాలకే ఎగబడే వారు ఎక్కువమంది వున్నారు. అదే బిర్యానీ విందు అయితే ఇంకేమైనా వుందా? అవును మరి.. చికెన్ బిర్యానీ అంటే లెగ్ పీస్ కోసం ఎదురుచూసే వారు చాలామందే. అలా చికెన్ బిర్యానీలో లెగ్ పీస్ కోసం ఓ వివాహ వేడుకలో కొట్లాట చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన ఓ వివాహ వేడుకలో బిర్యానీలో చికెన్ లెగ్ పీస్‌లు మిస్ అయ్యాయని పెళ్లి వేడుక రణరంగంగా మారింది. 
 
పెళ్లిలో వడ్డించిన చికెన్ బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని వరుడి వైపు నుంచి వచ్చిన అతిథులు గమనించడంతో గందరగోళం మొదలైంది. ఈ ఈవెంట్ నుండి వైరల్ ఫుటేజీలో అతిథులు ఒకరిపై ఒకరు తన్నడం, కొట్టుకోవడం, కుర్చీలు విసరడం వంటివి చూపుతున్నాయి. వరుడు కూడా గందరగోళంలో చిక్కుకున్నాడు.

రెండు కుటుంబాలు హింసాత్మకంగా ఘర్షణ పడడంతో సన్నివేశం పూర్తిగా హింసాత్మకంగా మారింది. పెళ్లిలో ఉన్న ఎవరో ఈ దృశ్యాన్ని రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అయ్యింది. 

ఆన్‌లైన్‌లో ఈ వీడియో వైరల్ అయినా పోలీసులకు అధికారిక ఫిర్యాదులు నమోదు కాలేదు. స్థానిక అధికారులు ఈ సంఘటన గురించి అధికారికంగా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments