Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరి పీల్చుకున్న ఉద్ధవ్ ఠాక్రే - ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం

Webdunia
సోమవారం, 18 మే 2020 (17:41 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికకావడంతో పదవీ గండం నుంచి తప్పించుకున్నారు. అదేసమయంలో ఆయన సోమవారం శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
మహారాష్ట్ర శాసనమండలికి ఇటీవల ఎన్నికలు జరిగాయి. మొత్తం 9 స్థానాలకు గాను తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో  ఉద్ధవ్ ఠాక్రేతో సహా తొమ్మిది మంది నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. 
 
ప్రమాణ స్వీకారం చేసినవారిలో సీఎంతో పాటు శివసేన పార్టీ నేత నీలం గోర్హీ, బీజేపీ నేతలు గోపిచంద్ పడాల్కర్, ప్రవీణ్ దాట్కే, రంజిత్ సిన్హా మొహిత్  పాటిల్, రమేష్ కరద్‌లు ఉన్నారు. 
 
కాగా, ఇప్పటి వరకు ఉభయ సభల్లో సభ్యుడు కాని ఉద్ధవ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుంటే పదవిని వదులుకోవాల్సి వచ్చేది. అయితే, ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పదవీ గండం నుంచి ఆయన గట్టెక్కారు. 
 
ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. మహాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు. దీంతో ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments